బిగ్‌బాస్‌ 2 అప్పుడే నిరాశ పర్చింది     2018-06-10   22:06:05  IST  Raghu V

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు గత రెండు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నిన్న లాంచనంగా ప్రారంభం అయ్యింది. నాని హోస్ట్‌గా కనిపించబోతున్న ఈ షోలో పార్టిసిపెంట్స్‌ ఎవరు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 2 బుల్లి తెరపై ప్రత్యక్షం అయితే అయ్యాడు కాని ఆశించిన రేంజ్‌లో ఆకట్టుకోవడం కష్టమేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ షోలో కనిపించబోతున్న సెలబ్రెటీల విషయంలోనే ప్రస్తుతం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో మంచి మంచి తారలు అలరించారు. కాని ఈసారి మాత్రం బడ్జెట్‌ కారణమో లేదంటే మరేంటో కాని ఇలా సాదా సీదా సెబ్రెటీలను రంగంలోకి దించారు.

ఇంతకు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో కనిపించబోతున్న సెలబ్రెటీలు ఎవరు అంటే.. సింగర్‌ గీతామాధురి, టీవీ9 దీప్తి, అమిత్‌ తివారి, శ్యామల, తేజస్వి, సామ్రాట్‌, దీప్తి సునైన, బాబు గోగినేని, రోల్‌ రైడ, కిరీటి, కౌశల్‌, భాను శ్రీలు సెబ్రెటీలు అంటూ చెబుతూ, సామాన్యులుగా నూతన నాయుడు, సంజన, గణేష్‌లను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపడం జరిగింది. వంద రోజులకు గాను ఈ 16 మంది పార్టిసిపెంట్స్‌ వెళ్లారు. వారంలో ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున వీరు ఇంటి నుండి బయటకు వస్తూ ఉంటారు. ఇక సెలబ్రెటీల విషయంలో ప్రస్తుతం ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.