బిగ్‌బాస్‌ 2 అప్పుడే నిరాశ పర్చింది     2018-06-10   22:06:05  IST  Raghu V

సీజన్‌ 2లో కనిపించబోతున్న 16 మంది పార్టిసిపెంట్స్‌లో కేవలం గీతామాధురి, శ్యామల, తేజస్విలు మాత్రమే తెలిసిన మొహాలు అని, మిగిలిన ఏ ఒక్కరు కూడా పెద్దగా చూసిన మొహాలు అనిపించడం లేదు అంటూ పెదవి విరుస్తున్నారు. గీతామాధురి తన పాటతో అలరిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇక తేజస్వి తన సందడితో షో మొత్తం సందడి చేయడం ఖాయం అనే నమ్మకంను నాని కలిగించాడు. కాని శ్యామల మాత్రం తన 11 నెలల బాబును వదిలేసి ఉండటం కష్టమే అని, ఆమె త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇలా సెలబ్రెటీల ఎంపిక విషయంలోనే బిగ్‌బాస్‌ నిరాశ పర్చడంతో మొదటి రోజే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడిపోయింది. ఇక రెండవ రోజు నుండి షో ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెద్దగా లేదు. మరో వైపు హోస్ట్‌గా నాని చాలా బెటర్‌ అవ్వాల్సిన అవసరం ఉంది. కాస్త కంగారు పడటంతో పాటు, ఎన్టీఆర్‌ను అనుకరించవద్దనే ఉద్దేశ్యంతో తానేదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. కాని అది వర్కౌట్‌ అవ్వడం లేదు. నాని ముందు ముందు ఖచ్చితంగా మెరుగు పడతాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. కాని పార్టిసిపెంట్స్‌ ఏమేరకు ఆకట్టుకుంటారు అనే విషయంలోనే కాస్త చర్చ జరుగుతుంది. 16 మందిలో ఎవరు ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంటారు అనేది ప్రస్తుతం చూడాలి.