జగన్ పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్..ఇదే  

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి.. పాదయాత్రపైనే ఇప్పుడు అందరి దృష్టి…నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర దాదాపు ఆరు నెలలపాటు 125 శాసనసభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. .. ఎప్పుడు చేసే పాదయాత్రలే గా అని అందరూ ఫిక్స్ అయ్యారు..కానీ ఇప్పుడు జగన్ పాదయాత్రలో ట్విస్ట్ ఉందని చెప్తున్నారు..ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒకటే చర్చ..ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే.

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాజాగా తండ్రిలానే పాదయాత్ర చేపట్టడానికి సిద్ధం అవుతున్నారు..వైఎస్ రాజశేఖర్ అంటే గుర్తొచ్చేది నిండైనపంచెకట్టు..ఎంతో హుందాగా.. దర్జాగా. .తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే రాజశేఖర్ రెడ్డి రైతుల మనిషిలా కనిపిస్తారు..ఇప్పుడు జగన్ కూడా పాదయాత్రలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగానే పంచెకట్టుతో కనిపించనున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.