త్వరలో చంద్రబాబు కి “భారీ షాక్”...ఒకే వేదికపైకి “పవన్ ,జగన్”     2018-04-24   01:04:57  IST  Bhanu C

త్వరలో ఏపీ రాజకీయాలలో ఊహించని భారీ మార్పులు రాబోతున్నాయా..? చంద్రబాబు నాయుడు కోలుకోలేని షాక్ ఇవ్వడానికి ఏపీలో రాజకీయ పార్టీలు సిద్దంగా ఉన్నాయా..? బీజేపి పద్మ వ్యుహంలోకి చంద్రబాబు చిక్కుకున్నారా..? ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానాలు అవుననే విధంగా ఉన్నాయి..అయితే పూర్తీ రిజల్స్ రావాలంటే మాత్రం తప్పకుండా సెప్టెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు..విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..రాష్ట్రంలో రాజకీయ అలజడి రేగే అవకాశం అతి త్వరలోనే ఉండబోతోందని..తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే భారీ స్కెచ్ బీజేపి ఇప్పటికే సిద్దం చేసిందని తెలుస్తోంది…వివరాలలోకి వెళ్తే..

రాజకీయాల్లో మిత్రులు శత్రువులు ,శత్రువులు మిత్రులు అవుతారు ఇది సహజమే..ఇదే ఈక్వేషన్ లో ఏపీ లో లెక్కలు మారిపోతున్నాయి..అవినీతిపరులు, అక్రమార్కులు…అని తిట్టనవాళ్ల దగ్గరకే..వారే నిజాయితీపరులు..అంటూ…వారి పంచన చేరడానికి ప్లాన్‌లు వేస్తున్నారు..ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా…ఇతర రాజకీయపార్టీలను తనవైపు కూడగడుతూ దూకుడుగా వెళుతోంది. నిన్న మొన్నటి దాకా …విమర్శించిన ‘సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌’ను తమవైపు తిప్పుకునేందుకు అన్ని వ్యుహాలని అమలు చేస్తోంది.