చంద్రబాబు కి షాకుల మీద షాకులు..పార్టీని వీడనున్న చల్లా...     2018-04-12   06:20:56  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు కి ఈ మధ్య అస్సలు టైం బాలేదు అని చెప్పాలి.ఒక్కొక్కరు ఒక్కో కారణంతో పార్టీని వీడుతున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పార్టీని వీడుతున్న వారిలో చాలా మంది నాలుగైదు సార్లు ఎమ్మెల్యే గా చేసిన వాళ్ళే కావడం విశేషం..అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జగన్ , పీకే ల పక్క వ్యూహంతో అధికార పక్షాన్ని ఆందోళనలో పడేయాలని తద్వారా చంద్రబాబు వెనుక ఉన్న నేతల్లో ఒక అస్తిరతని కలిగించాలనేది పక్కా వ్యూహంగా తెలుస్తోంది.


అందుకే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్న నేతలకి ముందు నుంచీ వైసీపి టచ్ లో ఉంటూ వస్తోంది..అయితే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ‘కొండపి’ టిడిపి ఎమ్మెల్యే శ్రీబాలవీరాంజనేయస్వామి పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వచ్చాయి..అయితే ఇదే విషయంపై కొండపి నియోజకవర్గ నేతలు సైతం ఈ విషయంపై అవుననే సమాధానాలు చెప్తున్నారు..ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా వైసీపిలోకి వెళ్తున్నారు అనే వార్తలు రావడం తీవ్ర చర్చనీయంసం అయ్యింది..కొండపి ఎమ్మెల్యే స్వామి జూపూడి ప్రభాకర్ మీద ఐదు వేల ఓట్లు తేడాతో గెలుపొందారు..ఆ తరువాత జూపూడి టిడిపిలోకి వెళ్ళడం అక్కడ నామినేటడ్ పదవి దక్కడం అన్నీ జరిగిపోయాయి అయితే..