బిగ్‌బాస్‌ 2కు డేట్‌ ఫిక్స్‌     2018-05-25   23:32:43  IST  Raghu V

పలు ప్రపంచ దేశాల్లో బిగ్‌బాస్‌కు విపరీతమైన ఆధరణ ఉంది. భారతదేశంలో కూడా హిందీ వర్షన్‌ దాదాపు పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులు అభిమానంను పొందుతూ వస్తుంది. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన బిగ్‌బాస్‌ను గత సంవత్సరం సౌత్‌ ఇండియాలో ప్రారంభించారు. తెలుగు మరియు తమిళంలో కొద్దిపాటి తేడాతో బిగ్‌బాస్‌ను షురూ చేయడం జరిగింది. తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. రెండు భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రెండు భాషల్లో కూడా సీజన్‌ 2కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

గత సంవత్సరం తమిళ బిగ్‌బాస్‌ ముందుగానే ప్రారంభం అయ్యింది. ఈసారి మాత్రం రెండు భాషల్లో దాదాపు ఒకేసారి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్‌ మాటీవీ వారు ఇప్పటికే నానిని హోస్ట్‌గా ఎంపిక చేయడంతో పాటు పార్టిసిపెంట్స్‌ ఎంపిక కార్యక్రమం పూర్తి చేశారు. వారితో ప్రస్తుతం అగ్రిమెంట్‌ను చేసుకుంటున్నారు. రేపటితో ఐపీఎల్‌ పూర్తి కాబోతుంది. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లో బిగ్‌బాస్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను జూన్‌లో ప్రారంభించనున్నట్లుగా స్టార్‌ మా వారు ప్రకటించారు.