టాలీవుడ్‌కు బిగ్‌బాస్‌ 2 ఫీవర్‌     2018-05-14   01:52:32  IST  Raghu V

హిందీలో సూపర్‌ సక్సెస్‌ అయిన బిగ్‌బాస్‌ను సౌత్‌లో కూడా గత సంవత్సరం ప్రారంభించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులో, కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా తమిళంలో ప్రసారం అయ్యింది. రెండు భాషల్లో కూడా బిగ్‌బాస్‌ సూపర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలుగు మరియు తమిళనాట రెండవ సీజన్‌కు సిద్దం అవుతున్నారు. తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే తెలుగులో మాత్రం ఇప్పటి వరకు హోస్ట్‌ ఎవరు అనేది ఖరారు కాలేదు. నానిని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రెండవ సీజన్‌లో స్థానం కోసం వేలాది మంది సెలబ్రెటీలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదటి సీజన్‌లో కేవలం సెలబ్రెటీలను మాత్రమే ఎంపిక చేశారు. కాని రెండవ సీజన్‌లో కొంత మంది సామాన్యులను కూడా ఎంపిక చేయబోతున్నట్లుగా మాటీవీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అంతా కూడా బిగ్‌బాస్‌లో కనిపించాని ముచ్చట పడుతున్నారు. సినిమాల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న వారు మరియు సినిమాల్లో ఛాన్‌ు లేని వారు బిగ్‌బాస్‌లో పాల్గొనాని ఆశ పడుతున్నారు. అందుకోసం తమకు తెలిసిన వారితో పెద్ద ఎత్తున పైరవీలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మా ఛానెల్‌లో నాగార్జునతో పాటు చిరంజీవికి గతంలో కీలక షేర్‌ ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికి కూడా వారు కొంత భాగంను కలిగి ఉండటంతో వారి వద్దకు ఎంతో మంది రికమండేషన్‌ కోసం వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.