మంత్రి పదవి కి రాజినామా చేయనున్న టీడీపీ మంత్రి     2018-05-11   02:02:37  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు కి త్వరలో బిగ్ షాక్ తగలనుందా ..? సాక్షాత్తు ఏపీ మంత్రి చంద్రబాబుని, టీడీపీ పార్టీ ని వీడ బోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలో ఏపీ మంత్రి ఒకరు తన మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది..ఇంతకీ ఎవరు ఆ మంత్రి ఏమిటా కధ అనే వివరాలలోకి వెళ్తే..పాత కధే అయినా ఇప్పటి టీడీపి ప్రభుత్వ పరిస్థితికి మాత్రం ఇది అతిపెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

ఏపీ రాజకీయాల కంటే కూడా నంద్యాల రాజకీయాలు ఎంతో భిన్నంగా ఉంటాయి..అయితే చంద్రబాబు కి ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ ఇప్పడు నంద్యాల రాజకీయాలని మార్చేయబోతోంది…ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది…ఒకప్పుడు భూమా కుటుంబానికి ఎంతో ఆప్తుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి భూమా మరణం తరువాత మాత్రం ఆ ఫ్యామిలీకి దూరం అయ్యారు. అయితే ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డికి మంత్రి భూమా అఖిలకు మధ్య నడుస్తున్న రాజకీయ వివాదం అంతకంతకూ ముదిరిపోతుందని చెబుతున్నారు..చంద్రబాబు ఎంత ఘాటుగా వార్నింగ్ ఇచ్చినా సరే వీరిద్దరి పరిస్థితిలో మార్పురాలేదు