భార్య తన భర్తను పేరు పెట్టి ఎందుకు పిలవకూడదో తెలుసా.? కారణం ఇదే.! మరేమని పిలవాలంటే!    2018-05-31   01:06:05  IST  Raghu V

గ‌తంలో భర్త‌ల‌ను భార్య‌లు ఎవండీ, బావగారూ,, జీ, హ‌జీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కార‌ణంగా…గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భ‌ర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఇది త‌ప్ప‌ట‌.! భ‌ర్త‌ల‌ను భార్య‌లు పేరుపెట్టి పిల‌వ‌కూడ‌ద‌ట‌. ఇలా చేయ‌డం అమ‌ర్యాద‌క‌రమ‌ట‌, అంతే కాదు న‌లుగురిలో భ‌ర్త విలువ‌ను త‌గ్గించిన‌ట్టేన‌ట‌.!

ఆ మాట‌కొస్తే…మ‌న‌క‌న్నా పెద్ద‌వాళ్ళ‌ను పేరుపెట్టి పిల‌వ‌డమే త‌ప్పు, అలాంటిది…..భార్య‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటాన‌ని అగ్నిసాక్షిగా ప్ర‌మాణం చేసిన భ‌ర్త‌ను పేరుపెట్టి పిల‌వ‌డం ముమ్మాటికీ త‌ప్పే అంటున్నాయి మ‌న‌ సాంప్ర‌దాయాలు. ఏకాంత స‌మ‌యంలో భ‌ర్త‌ను ఎలా పిలిచినా త‌ప్పులేన‌ప్ప‌టికీ….ఇంట్లో వాళ్ల ముందు, పిల్ల‌ల ముందు, బ‌య‌టి వాళ్ళ ముందు మాత్రం పేరు పెట్టి పిల‌వ‌కూడ‌ద‌ట‌, ఇలా చేయడం వ‌ల్ల ..వారిలో మీ భ‌ర్త గౌర‌వం త‌గ్గ‌డ‌మే కాక‌, మీ గౌర‌వ‌మూ త‌గ్గుతుంద‌ట‌.!