భరత్ అనే నేను మూవీ రివ్యూ  

చిత్రం : భరత్ అనేేేే నేేేనున
బ్యానర్ : DVV
దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాతలు : దానయ్య
సంగీతం : దేవిశ్రీప్రసాద్
విడుదల తేది : ఏప్రిల్ 20, 2018
నటీనటులు : మహేష్ బాబు, కియారా అద్వానీ తదితరులు

కథలోకి వెళితే :
ఆక్ఫర్డ్ యూనివర్సిటీ లో చదవుకుంటున్న భరత్ రామ్ (మహేష్ బాబు) తన కుటుంబంలో జరిగిన ఓ దుర్ఘటన వలన ఇండియా తిరిగి వస్తాడు‌. అయితే ఊహించని విధంగా వరద (ప్రకాష్ రాజ్) మాట మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తాడు భరత్. కుర్చీ ఎక్కిందే తడవుగా సోషల్ రిఫార్మర్ అవతారం ఎత్తుతాడు భరత్. దాంతో రాజకీయ శతృవులు పుట్టుకొస్తారు. ఓ దశలో భరత్ అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. మరి భరత్ ఈ ఆటుపోట్లు ఎలా ఎదర్కున్నాడు? తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా అనేది మిగితా కథ.

నటీనటులు నటన :

మహేష్ బాబు గత రెండు మూడు చిత్రాలు గమనిస్తే మెల్లోగా మాట్లాడటం, సబ్టిల్ గా పెర్ఫర్మ్ చేయడం అనేది స్పష్టంగా కనిపించే విషయం ‌. మహేష్ ఏంటి ఇలా మొనాటోనస్ గా అయిపోతున్నాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. అన్నిటికి సమాధానం చెప్పేసాడు. ఒకటి రెండు సన్నివేశాలు అని కాకుండా, సినిమా మొత్తం తన పునర్వైభవాన్ని చూపించాడు. అసెంబ్లీ సన్నివేశం, దర్గామహల్ ఒక ఎత్తైతే, ప్రెస్ మీట్ మహేష్ లోని ఇంటెన్సిటి ఏంటో చూపిస్తుంది. కాస్త నాటుగా చెప్పాలంటే, సూపర్ స్టార్ చింపేసాడు.

కియారా అందంగా ఉంది. డిసెంట్ గా అభినయించింది. ప్రకాష్ రాజ్ షరామాములే‌. రవిశంకర్ గుర్తుంచుకోదగ్గ పాత్రలో కనిపించారు.