పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా..!     2018-05-06   23:51:54  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. ఈ చిత్రం దాదాపు 200 కోట్లకు చేరువలో ఉంది. మరో రెండు మూడు రోజుల్లో 200 కోట్లను క్రాస్‌ చేయడం ఖాయం అని తేలిపోయింది. అయితే ఇంత భారీగా వసూళ్లు సాధిస్తున్నప్పటికి కూడా ఈ చిత్రంను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబ్యూటర్లు నష్టాల్లోనే ఉన్నట్లుగా ట్రేడ్‌ వర్గాల్లో సమాచారం అందుతుంది. రెండు మూడు ఏరియాల్లో ఇంకా ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్‌ను ఒడ్డున పడేయలేదని తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్స్‌ లాంగ్‌ రన్‌లో సేఫ్‌ అయినా ఎగ్జిబ్యూటర్లు మాత్రం నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో అంచనాల నడుమ తెరకెక్కిన భరత్‌ అనే నేను చిత్రాన్ని దాదాపు 125 కోట్లకు అన్ని ఏరియాల్లో కొనుగోలు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు అంతే మొత్తంలో ఎగ్జిబ్యూటర్లకు, బయ్యర్లకు అమ్మడం జరిగింది. కొందరు బయ్యర్లు మహేష్‌బాబు అనే ఆశతో కాస్త ఎక్కువ మొత్తంను పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.