పాపం చరణ్‌.. ఇది మహేష్‌ స్థాయి, సత్తా     2018-05-03   01:17:09  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మరోసారి తన సూపర్‌ స్టార్‌ పవర్‌ను చూపించాడు. ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’ చిత్రాలతో డిజాస్టర్‌లను చవిచూసిన మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో రికార్డులు బ్రేక్‌ చేశాడు. టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా భరత్‌ నిలవడంతో మహేష్‌ క్రేజ్‌ ఏంటో మరోసారి నిరూపితం అయ్యింది. ‘శ్రీమంతుడు’ చిత్రంతో రికార్డులు బ్రేక్‌ చేసిన మహేష్‌బాబు మరోసారి భరత్‌ అనే నేను చిత్రంతో రికార్డుల దుమ్ము దులపడం జరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకున్న ‘భరత్‌ అనే నేను’ 200 కోట్లకు చేరువలో ఉంది. అతి త్వరలోనే ఆ మార్క్‌ను క్రాస్‌ చేయబోతున్నట్లుగా ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన రంగస్థలం చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. తెలుగులో 200 కోట్ల క్లబ్‌లో చేరిన మూడవ చిత్రంగా రంగస్థలం పేరు సంపాదించింది. అయితే ఈ మురిపేం మూడు రోజులు కూడా మిగల్లేదు.