బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా...అయితే ఇది మీ కోసమే!     2018-03-11   23:12:30  IST  Lakshmi P

Best Weight Loss Remedy

వాల్ నట్స్
వీటిలో మాంగనీస్, కాపర్‌లు సమృద్ధిగా ఉండుట వలన అధిక బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ వాపులను తగ్గించటంలో సహాయపడుతుంది. వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండుట వలన బరువును కంట్రోల్ చేస్తుంది.

పల్లీలు
సాధారణంగా అందరూ పల్లీలు తింటే బరువు పెరుగుతామని భావిస్తారు. దానిలో ఎంత మాత్రం నిజం లేదు. ప్రతి రోజు సరైన మోతాదులో పల్లీలను తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్ అందుతుంది. దాంతో కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయదు. కాబట్టి బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు పల్లీలను స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

పిస్తా పప్పు
దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగి ఆకలి తొందరగా వేయదు. పిస్తాలో ఉండే పోషకాలు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు తగ్గుతారు.