చర్మ సమస్యలకు చెక్ పెట్టె వంటింటి ఇంగ్రీడియెంట్స్    2018-05-06   23:46:03  IST 

చర్మ సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మార్కెట్ లో దొరికే కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు. అవి ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్ ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువుల ద్వారా చర్మ సమస్యల నుండి బయట పడవచ్చు. ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నల్లటి వలయాలు – కుకుంబర్ కుకుంబర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన నల్లటి వలయాలను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. కుకుంబర్ స్లైసెస్ మూసి ఉన్న కనురెప్పలపై ఉంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో 2 నుంచి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.