Best Health Benefits Of Fermented Rice

పూర్వ కాలంలో ఇంటిలో ప్రతి ఒక్కరు ఉదయం చద్దన్నం తినేవారు. రోజుని చద్దన్నం తినటంతోనే ప్రారంభించేవారు. ఈ రోజుల్లో అయితే ఎవరు చద్దన్నం తినటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

రకరకాల టిఫిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ చద్దన్నంలో చాలా పోషక విలువలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే వావ్ అంటారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

రాత్రి వండిన అన్నాన్ని ఉదయం పెరుగు, ఉల్లిపాయతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు తినటం లేదు. పల్లెలో అయితే రాత్రి మిగిలిన అన్నాన్ని పశువులకు పెడుతున్నారు. కానీ చద్దన్నం లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే తినాలని అనిపిస్తుంది.

ఉదయం టిఫిన్ కి బదులు చద్దన్నం తింటే హుషారుగా ఉండటమే కాకుండా పొట్ట తేలికగా ఉంటుంది.

చద్దన్నం లో ఉండే లాక్టిక్ యాసిడ్ పొటాషియం,ఐరన్ గా మారటం వలన బిపి వంటివి రావు.

తాజాగా వండిన అన్నంతో పోలిస్తే చద్దన్నంలో కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

విటమిన్స్ లో బి6,బి12 అనేవి చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కువగా సప్లిమెంట్స్ మీద ఆదారపడవలసి ఉంటుంది. అయితే చద్దన్నంలో బి6,బి12 విటమిన్స్ సమృద్దిగా లభిస్తాయి.

చద్దన్నంలో మంచి బ్యాక్టీరియా ఉండుట వలన జీర్ణ సమస్యలను తగ్గించటమే కాకుండా రోగ కరకాల మీద పోరాటం చేయటానికి రోగ నిరోదక శక్తిని అందిస్తుంది.

చద్దన్నం తినటం వలన ఎముకల సమస్యలు,చర్మ ఎలర్జీలు, పొట్ట సమస్యలు రావు.

ప్రతి రోజు చద్దన్నం తింటే వయస్సు ప్రభావం కనపడకుండా యవ్వన్నంగా ఉండేలా చేస్తుంది.