స్టామినా పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం

మన రోజువారీ కార్యక్రమాలను చేయటానికి స్టామినా చాలా అవసరం. జీవితంలో ఒత్తిడి ఎక్కువ అయ్యి అలసిన లేదా శక్తి తగ్గినా ఆ ప్రభావం మన పనితీరుపై పడుతుంది. స్టామినా పెంచుకోవటానికి వ్యాయామాలు ఉన్నా కొన్ని ఆహారాలను తీసుకోవటం ద్వారా దీన్ని అదికమించవచ్చు. ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఆ ఆహారల గురించి తెలుసుకుందాం.

1. చిలకడదుంప

చిలకడదుంప శరీరం మొత్తానికి స్టామినాను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. బాడీ బిల్డర్లు ఎక్కువ శక్తి కోసం చిలకడదుంప మీద ఆధారపడతారు. శరీరం కణాల ప్రోటీన్ చుట్టూ కొవ్వు చేరకుండా సహాయపడే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా రోజువారీ ఆహారంలో చిలకడదుంపను తీసుకుంటే స్టామినా పెరుగుతుంది.

2. అరటిపండు

అరటిపండు శరీరంలో శక్తి పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో ఉపయోగపడే హార్మోన్స్ విడుదలలో సహాయపడతాయి. ఇది మొత్తం శరీరం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అందువల్ల వ్యాయామం చేయటానికి ముందు అరటిపండు తింటే మంచిది.