ఈ ఆహారాలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది    2018-04-03   00:32:29  IST  Lakshmi P

చర్మం పొడిబారి కాంతివిహీనంగా ఉంటే ఎవరికీ నచ్చదు. అందుకే ప్రతి ఒక్కరు చర్మం కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. చర్మం కాంతివంతంగా,మృదువుగా ఉండటానికి అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఆలా కాకుండా ప్రతి రోజు కొన్ని ఆహారాలను తీసుకుంటూ ఉంటే చర్మం కాంతివంతంగా,మృదువుగా మారుతుంది. అంతేకాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

పాలకూర పాలకూరలో విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు సమృద్ధిగా ఉండుట వలన వృద్దాప్య లక్షణాలు రాకుండా అడ్డుకుంటాయి. ప్రతి రోజు పాలకూరను ఆహారంలో తీసుకుంటే నలభైలో కూడా చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంటుంది.

సబ్జా గింజలు
సబ్జా గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి.