చర్మం మీద అద్భుతంగా పనిచేసే శనగపిండి ఫెస్ పాక్స్  

శనగపిండిని ముఖ సౌందర్యం కోసం మన అముమ్మల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. శనగపిండి అన్ని చర్మ తత్వాలకు సరిపోతుంది. ఎటువంటి రేష్ లు రావు. చర్మ సమస్యలను తగ్గించి చర్మం మృదువుగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు చెప్పే శనగపిండి పేస్ ప్యాక్ లను ఉపయోగిస్తే అద్భుతమైన పలితాలు పొందవచ్చు. ఆ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్,అరస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల గ్రీన్ టీ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు.