చెత్తకుప్పలో పడి ఉన్న పసికందును చేరదీసి పాలిచ్చి కాపాడారు బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్     2018-06-13   01:08:49  IST  Raghu V

చెత్తకుప్పలో దొరికిన పసి పాపని పోలీస్ స్టేషన్ ఆ స్టేషన్‌కు తీసుకురాగానే, అర్చన అందుకుని పాలు పట్టించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఆ చిన్నారి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. పసికందు ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. నా బిడ్డే ఏడుస్తున్నట్టుగా అనిపించింది. నా బిడ్డే అన్నట్టుగా పాలిచ్చాను. అంత పసిబిడ్డకు డబ్బాతో పాలు ఎలా తాగిస్తాం?అని అర్చన అంది.

ఆమె ఐదేళ్లుగా పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఈ మధ్యే ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చారు.

అసలు విషయం

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ నిర్మాణ ప్రాంతం వద్ద పసికందు అనాథగా పడి ఉండటం చూసి చెత్త ఏరుకునే వ్యకి సమీపంలోని దుకాణం నిర్వాహకుడికి చెప్పారు. ఆ విషయాన్ని దుకాణదారుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పారు.దాంతో వెంటనే ఏసీపీ ఆర్.నగేష్ అక్కడికి వెళ్లి చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చిన్నారిని శుభ్రం చేయగానే, పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లాం. గుక్కపట్టి ఏడుస్తున్న ఆ బిడ్డను వెంటనే అర్చన తన చేతుల్లోకి తీసుకున్నారు. స్టేషన్‌ లోపలికి వెళ్లి చనుపాలు ఇవ్వడం ప్రారంభించారు. అది చాలా ప్రశంసనీయమైన విషయం” అని నగేశ్ అన్నారు.