చెత్తకుప్పలో పడి ఉన్న పసికందును చేరదీసి పాలిచ్చి కాపాడారు బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్     2018-06-13   01:08:49  IST  Raghu V

చెత్త కుప్పలోంచి తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఆస్పత్రి నుంచి బయటకు రాగానే స్థానిక దుకాణదారుడు బేబీ కోసం కొన్ని బట్టలు ఇచ్చారు. అతడు కూడా డబ్బులు తీసుకోలేదు అని ఆయన వివరించారు.

ఆ చిన్నారికి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి పేరు పెట్టామని నగేశ్ తెలిపారు.అర్చన చేసిన పని చాలా గొప్పది. మన సమాజంలో పసిపిల్లలను దైవ సమానంగా చూస్తాం. ఆ చిన్నారికి తన తల్లి ఎవరో కూడా తెలియదు.తాను చేసిన పనికి తన భర్త కూడా ప్రశంసించారని అర్చన ఆనందం వ్యక్తం చేశారు.

కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే ఓ పసిబిడ్డను గుర్తించాం. అయితే సమీపంలోనే ఆ బిడ్డ తల్లి దొరకడంతో ఆమెనే పాలిచ్చారు. ఒక అనాథ బిడ్డకు నేను పాలివ్వడం ఇదే తొలి అనుభవం అని అర్చన తెలిపారు.ఆమె చేసిన పనికి సోషల్ మీడియా లో ప్రశంసల జల్లు కురుస్తుంది..