నగ్నంగా పడుకుంటే ఇన్ని రకాలుగా మంచిది

మనిషి పుట్టడమే నగ్నంగా పుట్టాడు. కాబట్టి మనుషులు బట్టలతో శరీరాన్ని కప్పుకోవాల్సిందే అనే రూలేమి పెట్టలేదు దేవుడు. బట్టలు వేసుకోకుండా ఇప్పుడు తిరగడం కష్టం కాని, నగ్నంగా పడుకోవడం కూడా కష్టం అంటారా?

అందరికి వీలుపడదు కాని, మీలో గనుక ఒంటరిగా ఉండేవాళ్ళుంటే, లేక పిల్లలు లేని జంటలు ఉంటే, నగ్నంగా పడుకోండి. అదే అరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. నమ్మకపోతే కాస్త కిందున్న లాభల్ని గమనించండి

సుఖమైన నిద్ర :

నగ్నంగా నిద్రపోవడం వలన ప్రశాంతమైన నిద్ర దొరుకుతుంది ఒంటికి. బాడి టెంపరేచర్ మన బట్టల వలన చాలా పెరుగుతుంది. నగ్నంగా పడుకోవడం వలన టెంపరేచర్ తగ్గి సుఖంగా నిద్రపడుతుంది. అలాంటి నిద్ర వలన ఎన్ని లాభాలో ప్రత్యేకంగా చెప్పాలా?

వీర్యకణాల ఉత్పత్తికి మంచిది :

మన లోదుస్తుల వలన కూడా వీర్యకణాలలో తరుగుదల ఉంటుదట. వృషణాలు ఒత్తిడికి గురవడం వలన వీర్యకణాల ఉత్పత్తి తగ్గుంతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇందుకోసమైనా నగ్నంగా పడుకోవడమే మంచిది.

బీపి కంట్రోల్, డిప్రేషన్ మాయం, రోగనిరోధక శక్తి :

భాగస్వాములు ఇద్దరు నగ్నంగా పడుకుంటే మరీ మంచిదట. శరీరాల తాకిడి వలన ఆక్సిటోసీన్ అనే హార్మోన్ సరైన మోతాదులో విడుదలవుతుంది మన శరీరంలో. ఈ హార్మోన్ వలన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండటమే కాకుండా, డిప్రెషన్ కి గురవడం, కోపంగా మాట్లాడటం అనేది తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి మాత్రమే కాకుండా, దురద నుండి విముక్తి, చర్మపు రంగు మెరుగవటం, హైజీన్ … ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఇంకెన్నో లాభాలున్నాయి నగ్నంగా పడుకోవటం అలవాటు చేసుకుంటే.

ఛీ, ఇదేమి అలవాటు అని అనుకోకండి … సినిమాతారల్లో చాలామందికి ఈ అలవాటు ఉంది. ఆరోగ్యం గురించి జ్ఞానం, భక్తి ఉంది కాబట్టే వాళ్ళు పాటిస్తున్నారు.

,