Benefits of Rose Water

ఇక్కడ అద్భుతమైన చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ కొరకు రోజ్ వాటర్ యొక్క 10 ప్రయోజనాలు ఉన్నాయి. రోజ్ వాటర్ అనేది ప్రతి భారతీయుని ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. జిడ్డు చర్మం,పొడి చర్మం మరియు కాంబినేషన్ చర్మం ఇలా ఏ చర్మ తత్వానికి అయినా బాగా సెట్ అవుతుంది. భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఇది ఒక రహస్య ఆయుధం అని చెప్పవచ్చు. రోజ్ వాటర్ కొనుగోలు చేసేటప్పుడు, 100 శాతం స్వచ్ఛమైన రోజ్ వాటర్ అని నిర్ధారణ చేసుకొని కొనుగోలు చేయాలి. ఈజిప్ట్ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్లియోపాత్రా ఆమె చర్మ సంరక్షణకు సహజమైన రోజ్ వాటర్ ని ఉపయోగించేది.

10 రోజ్ వాటర్ ప్రయోజనాలు:

1. రోజ్ వాటర్ చర్మం యొక్క pH సంతులనం నిర్వహించడానికి మరియు అధికంగా ఉన్ననూనెను నియంత్రించటానికి సహాయపడుతుంది.

2. రోజ్ వాటర్ లో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన చర్మ చికాకు, చర్మం మీద ఎరుపుదనం,మోటిమలు,తామర వంటి వాటిని తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే అవరోధం ఏర్పడిన రంధ్రాల ద్వారా పేరుకుపోయిన నూనె మరియు దుమ్ము తొలగించటంలో ఒక గొప్ప ప్రక్షాళనగా పనిచేస్తుంది.

3. చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచటం, రిఫ్రెష్ లుక్ ఇవ్వటం, చర్మాన్ని తేమగా ఉంచటంలో రోజ్ వాటర్ సహాయపడుతుంది.

4. రోజ్ వాటర్ లో యాంటి బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మచ్చలు, కోతలు మరియు గాయాల నయంలో సహాయపడుతుంది.