ముల్తానీ మట్టిలో ఉన్న సౌందర్య రహస్యాలు తెలుసుకుందాం

ముల్తానీ మట్టిని ముఖానికి ప్యాక్ గా వేసుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది. దాంతో ముల్తానీ మట్టిలో ఉండే కాంపౌండ్స్ మృత కణాలను తొలగిస్తాయి. అంతేకాక చర్మం లోపల ఉన్న నూనె ,సీబమ్ లను తొలగించటంలో కూడా సహాయపడతాయి. అలాగే ముల్తానీ మట్టిలో ఉన్న గుణాలు చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తాయి. చర్మంపై మలినాలను తొలగించటానికి కూడా బాగా సహాయపడతాయి.

ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, గంధం పొడి వేసి బాగా కల్పి పేస్ట్ గా చేసుకొని నల్లగా ఉన్న మెడ ప్రాంతంలో రాస్తే క్రమంగా మెడ మీద ఉన్న నలుపు పోతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

ముల్తానీ మట్టిలో ఉండే మినరల్స్ నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడతాయి. దీని కోసం ఒక ప్యాక్ ని తయారుచేసుకోవాలి. ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి అరగంట తర్వాత పుదీనా పొడి వేసి కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని నల్లమచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.