బెండకాయలో ఉన్న బరువు నష్టం మరియు ఆరోగ్య ప్రయోజనాలు  

బెండకాయ తినటం వలన బరువు తగ్గటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1. బరువు నష్టం

తక్కువ కేలరీలు ఎక్కువ ఫైబర్ కలిగి ఉన్న బెండకాయ బరువు నష్టంలో సహాయపడుతుంది. ఎక్కువ ఫైబర్ ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది.

2. గుండె వ్యాధులు

బెండకాయలో కరిగే ఫైబర్ పెక్టిన్ ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో కొలస్ట్రాల్ చేరకుండా మరియు చేరిన కొలస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడి ఎథెరోస్క్లెరోసిస్ రాకుండా నిరోధిస్తుంది.

3. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

యూగేనోల్ అనే ఫైబర్ రకం జీర్ణక్రియ మరియు రక్త ప్రవాహంలో చక్కెర శోషణ నెమ్మదిగా జరిగేలా సహాయపడుతుంది. అందువలన భోజనం తర్వాత షుగర్ వలన వచ్చే చిక్కులను తప్పించడంలో సహాయపడి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరణ చేస్తుంది.

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఫైబర్ కంటెంట్ సమృద్దిగా ఉండుట వలన జీవక్రియ క్రమబద్ధీకరణలో సహాయపడుతుంది. పెక్టిన్ ప్రేగుల్లో వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. బెండకాయను రెగ్యులర్ గా వాడితే మలబద్ధకం సమస్య నుండి బయట పడవచ్చు.

5. గర్భం

గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు ఇది ముఖ్యమైన ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే బెండకాయలో ఫోలిక్ ఆమ్లం / ఫోలేట్ ఉండుట వలన గర్భాధారణకు సహాయపడుతుంది.