నానబెట్టిన బాదం పప్పులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే...రోజు తింటారు     2017-10-14   21:50:30  IST  Lakshmi P

Benefits of Eating Soaked Almonds

ప్రతి రోజు బాదం పప్పులను తినటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అదే నానబెట్టిన బాదాం పప్పును తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా ఇది అడ్డుపడుతుంది. నానబెట్టిన బాదంలో విటమిన్ బి7, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య ఛాయల నుండి కాపాడుతుంది.

ఇప్పుడు బాదం పప్పును ఎలా నానబెట్టాలో తెలుసుకుందాం. గుప్పెడు బాదం పప్పులను ఒక చిన్న బౌల్ లో వేసి అవి మునిగేలా నీటిని పోయాలి. తర్వాత మూతపెట్టి సుమారు 8 గంటలు నాననివ్వాలి. ఆ తర్వాత వాటి తోలు తీసి తినేయాలి. తోలు తీశాక ప్లాస్టిక్ బాక్సులో ఉంచి మూత పెడితే ఐదారు రోజుల వరకు నిల్వ ఉంటాయి.