రాగి ప్రాతలతో మంచినీరు తాగితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో    2018-04-05   23:33:13  IST 

అల్సర్, అజీర్ణం, టాక్సిన్స్ .. ఇలాంటి చెత్తచెదారాల గురించి మన పూర్వికులకి పెద్దగా తెలియదు‌. అందుకు కారణం కేవలం కెమికల్స్ లేని తిండి పదార్థాలే కాదు, మలీనాలు లేని మంచినీరు కూడా. రాగి చెంబులే వారి చేతిలో వాటర్ ఫిల్టర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు. కాల క్రమేనా రాగిని పూర్తిగా పక్కన పెట్టేస్తూ పోయారు. కాని మనం ఎంతలా నష్టపోతుమున్నామో మనకు తెలియదు. రాగి పాత్రలతో మంచినీరు తాగితే శరీరానికి ఎంత లాభమో మీరే చూడండి.

* రాగి పాత్రలు ఒలిగోడైనామిక్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. దాంతో రాగి పాత్రల్లో బ్యాక్టీరియా బ్రతకడం కష్టం. రాగి పాత్రల్లో నీళ్ళను భేషుగ్గా, ఎలాంటి భయం లేకుండా తాగవచ్చు.


* డీటాక్సీఫికేషణ్ అంటే శరీరంలో ఉన్న మలీనాలను బయటకి తోయడం. రోజుకి సరిపడా మంచి నీళ్ళు తాగడమే దీనికి మార్గం. అందులోనూ, రాగి పాత్రలోని నీళ్ళు తాగితే ఇంకా మంచిది.. పైన చెప్పినట్టుగా, రాగి పాత్రల్లో బ్యాక్టీరియా బ్రతకడం కష్టం. కాబట్టి ఎలాంటి మలీనాలు లేని నీళ్ళు తాగితే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు.