కమల్‌ చేసిన పాత్రలో బెల్లంకొండ అలరిస్తాడా.. అల్లరిపావుతాడా     2018-07-04   23:32:10  IST  Raghu V

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ సక్సెస, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను చేసుకుంటూ వస్తున్నాడు. కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి భారీ చిత్రాలు చేస్తూ దూసుకు పోతున్న ఈ బెల్లంకొండ తాజాగా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. స్టార్‌డం వచ్చిన తర్వాత లేదా స్టార్‌గా గుర్తింపు దక్కించుకుని కొంత కాలం స్టార్‌ ఇమేజ్‌ను అనుభవించిన తర్వాత ప్రయోగాు చేస్తారు. కాని బెల్లంకొండ మాత్రం ముందే ప్రయోగాలు కూడా చేసేస్తున్నాడు.

ప్రస్తుతం ‘సాక్ష్యం’ చిత్రంతో పాటు మరో చిత్రాన్ని చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ త్వరలో మరో చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ చిత్రంలో చాలా అమాయకపు పల్లెటూరు కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం బెల్లంకొండ శ్రీనివాస్‌ గతంలో వచ్చిన పలు పాత చిత్రాలను, పాత చిత్రంలోని పల్లెటూరు హీరోల పాత్రలను చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ పాత్ర స్వాతిముత్యంలోని కమల్‌ హాసన్‌ తరహాలో ఉంటుందనే టాక్‌ సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో వినిపిస్తుంది.

స్వాతిముత్యం చిత్రంలో కమల్‌ హాసన్‌ నట విశ్వరూపంను చూడవచ్చు. ఆ చిత్రంలో చాలా అమాయకపు పాత్రలో నటించి అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును ఆ పాత్ర కమల్‌కు తెచ్చింది. అంతటి గొప్ప పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించబోతుండటం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కనీసం పది సినిమాల వయస్సు కూడా లేని బెల్లంకొండ ఈ స్థాయి పాత్రను చేయడం అంటే దాదాపు అసాధ్యం అంటూ కొందరు ముందే చెప్పేస్తున్నారు.