2.0 ని ఈ హీరో కాదంటేనే, రజినీకాంత్ కి ఇచ్చారు     2017-10-20   04:33:42  IST  Raghu V

Before Rajinikanth started 2.0, this actor rejected the film

సూపర్ స్టార్ రజినీకాంత్ – సంచనాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఎంథీరన్ (తెలుగులో రోబో) ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మీకు ఇంకా గుర్తుకు ఉండే ఉంటుంది. ఖలేజా డిజాస్టర్ అయినా, బృందావనం లాంటి హిట్ సినిమాని పక్కన పెట్టుకొని ఆ సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది అప్పట్లో రోబో. అందువలనే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ 2.0 ని 90 కోట్లకు పైగా చెల్లించి కొంటున్నారు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్. ఇంత బిజినెస్ జరగడానికి శంకర్ తో పాటు రజినీకాంత్ కూడా కారణం. కాని ఈ క్రేజీ సీక్వెల్ తిరిగి రజినీకాంత్ కి రాకముందు మరో హీరో చేతిలో పడిందని చెబితే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే, ఎందుకంటే స్వయంగా ఆ హీరోనే ఈ విషయాన్ని బయటపెట్టాడు.

అంత పెద్ద హీరో ఎవరబ్బా అని మీరు ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత మార్కెట్ ఎవరికీ ఉంది, ఆమీర్ ఖాన్ కి తప్ప. అవును, 2.0 కోసం ఆమీర్ ఖాన్ ని సంప్రదించారట శంకర్. రజిని కూడా ఆమీర్ ని ఈ సినిమా చేయమని కోరారట. అందుకు కారణం అప్పుడు రజినీ ఆరోగ్యం బాగాలేకపోవడమే. 2.0 బడ్జెట్ ఏకంగా 350 కోట్లు. అంత బడ్జెట్ ని రికవర్ సులువుగా చేయాలంటే అది ఆమీర్ వల్లే అవుతుంది. ఎందుకంటే గ్రాఫీక్ సినిమాలు తీయకపోయినా, ఆమీర్ మార్కెట్ 2000 కోట్లు. కాని 2.0 సినిమా చేయలేనని చెప్పేసాడు ఆమీర్.