పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి

స్త్రీ శరీరానికి తప్పని ఇబ్బందే పీరియడ్స్. నిజానికి స్త్రీ అస్తిత్వానికి పీరియడ్స్ అవసరమైన, పీరియడ్స్ ని ఇష్టంగా ఏ మహిళా స్వీకరించలేదు. కాని శరీర నిర్మాణం ప్రకారం తప్పదుగా.

చాలామంది స్త్రీలు అవగాహనరాహిత్యం వలన అప్పటికే కష్టంగా ఉన్న పీరియడ్స్ ని కొన్ని తప్పులు చేసి మరింత కష్టంగా మార్చుకుంటారు. మరి ఆ తప్పులెంటో చూడండి ఓసారి.

* చాలామంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో మలబద్దకం, మోషన్స్, కడుపు ఉబ్బటం లేదా కడుపు నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బందిపడతారు. ఈ సమస్యలు వేరైనా ఒకే కారణం వీటి వెనుక ఉండవచ్చు. అదే తిండి ఎగ్గొట్టడం. అవును ఓ పూట ఆహారం తీసుకోకపోయినా ఇబ్బందే. పీరియడ్స్ లో డైట్ బాగా పాటించాలి. సమయానికి మంచి ఆహారం తప్పకుండా తీసుకోవాలి.