Basic duties of husband after she delivered a baby

రసవం జరగక ముందు మాత్రమే కాదు, ప్రసవం జరిగిన తరువాత కూడా మహిళలు తమ శరీరం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రసవించిన తరువాత కూడా స్ట్రీ శరీరం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. డెలివరి సమయంలో నొప్పులు, రక్తాన్ని కోల్పోవాడం, నీరసంగా అనిపించడం, యోని లోంచి వాసనతో కూడిన డిశ్చార్జ్, ఒళ్ళంతా నొప్పులు .. అబ్బో ఇవన్ని డెలివరి తరువాత మహిళలు చూసే సమస్యలే. ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేయడానికి శరీరం సహకరించదు. బలం కావాలి, రక్తం కావాలి, రోగనిరోధక శక్తి కావాలి .. ఇవన్ని మహిళకి తిరిగి రావాలంటే, ఆమె శరీరాన్ని ఆమె మాత్రమే కాదు,భాగస్వామి కూడా పట్టించుకోవాలి. డెలివరి తరువాత ఆమె అవసరాలు ఏంటో చెబుతున్నాం చూడండి.

* మానసికంగా, శారీరకంగా .. ఆమెకి విశ్రాంతి అవసరం. అలాగని ఆమె ఉన్నచోటే కూర్చునివ్వొద్దు. కొంచెం నడవమనండి, నడిపించండి, రక్తం బాగా సర్కిలేట్ అయ్యేలా, చిన్నపాటి వ్యాయామాలు చేయించండి. ఓ ప్రశాంతమైన వాతావరణం ఆమెకి ఇవ్వండి.