Ban on Rs.10 coins .. rumor hits Karnataka badly

నోట్ల రద్ది తరువాత కొన్ని రోజులకి కరెన్సి బ్యాన్ వలన ఉప్పు ధర పెరిగిపోయింది, కిలో 400-500 రూపాయల దాకా వెళుతుంది అని ఓ రూమర్ పుట్టుకొచ్చింది గుర్తుందా? జనాలంతా నిజమని నమ్మి కిరాణ కొట్టులకు పరుగులు తీసారు. రెండేసి, మూడేసి ఉప్పు ప్యాకెట్లు ఎగబడి తెచ్చేసుకున్నారు. మళ్ళీ అలాంటి పరుగే నిన్న తీసారు కర్ణాటక జనాలు. ఈసారి కూడా ఓ రూమర్ వలనే ఇలా జరిగింది.

ఎక్కడినుంచో వచ్చిందో, ఎలా వచ్చిందో కాని, నకిలీ నాణెములు ఎక్కువ అవటం వలన, రూ.10 నాణాలను ఆర్బీఐ బ్యాన్ చేసిందని, ఈ క్షణం నుంచే ఈ నాణెములు చెల్లవని ఓ గాలికబురు కర్టాటకలో పెద్ద దుమారమే రేపింది. నాణేలు ఉన్న ప్రజలు బ్యాంకులకి పరుగులు తీసారు.

బ్యాంకువారికి మొదట అర్థం కాలేదు ఈ రచ్చ ఏంటని. ఆ తరువాత నెమ్మదిగా, ఓపిగ్గా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు, ఇది పుకారు అని, అసలేమాత్రం నిజం లేని గాలికబురు అని. ఈ విషయం అర్బీఐ దాకా వెళ్ళడంతో, ఆర్బీఐ బెంగళూరు శాఖ చీఫ్ మెనేజర్ పీజే థామస్ మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. ఈ వార్తలను నమ్మి ఎవరైనా రూ.10 నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తే నేరంగా పరిగణిస్తామని, ప్రజలు కూడా ఈ రూమర్ ని నమ్మొదని చెప్పుకొచ్చారు.