పార్టీ నుంచి పోండి….. బాల‌య్య సీరియ‌స్‌

బాలకృష్ణ కి మళ్ళీ కోపం వచ్చింది.ఈ సారి ఆకోపం అభిమానుల మీద కాదు తన నియోజకవర్గ టీడీపి నేతల మీద. హిందూపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో నిన్న బాలయ్య సమీక్ష నిర్వహించారు అక్కడ టీడీపి నేతలు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉండటం బాలయ్యకి కోపాన్ని తెప్పించింది. దీంతో ఆయ‌న‌ ఒక్కసారిగా వాళ్ళమీద సీరియస్ అవుతూ..అందరు కలిసి పనిచేస్తే చేయండి లేకపోతే పార్టీ నుంచీ వెళ్ళిపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బాలయ్యా మాట్లాడుతూ నేతలు అంతా విభేదాలు మరిచి సయోధ్యతో పనిచేయాలని ఒకరి మండలంలోమరొకరు కల్పించుకోకూడదు అని సూచించారు.నియోజకవర్గ ప్రజలకు ప్రతీ సంక్షేమ ఫలం అందేలా చేయడమే మన లక్ష్యం అని ఆ దిశగా అందరు పనిచేయాలని చెప్పారు.

త‌న నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చడం మీద దృష్టి సారించిన బాలయ్య సీఎం పదవిపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తాను సీయం కావాలని కానీ,మంత్రిని కావాలని కానీ,పార్టీలో పెద్ద పెద్ద పదవులు ఏమీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు అని తన తండ్రి పోటీ చేసి గెలిచిన హిందూపురం అభివృద్దే నా ముందు ఉన్న లక్ష్యం అని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి అవసరమైన సేవలను అందిస్తానే తప్ప ముఖ్యమంత్రి పదవి పొందాలని ఎన్నడూ అనుకోనని తెలిపారు.