బాలయ్యకు ఇది అవాటే.. కాని ఫ్యాన్స్‌ సిగ్గుతో చస్తున్నారు!     2018-05-11   23:21:39  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతికి ‘జైసింహా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు రవికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. డిజాస్టర్‌గా నిలిచిన ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాన్ని తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించాలని భావించాడు. అందుకోసం దాదాపు మూడు నెలల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ చేయించాడు. దర్శకుడు తేజతో ఈ సినిమా చేయాలని భావించినా కూడా ఆ తర్వాత ఆయన్ను తప్పించాడు. ఇప్పుడు సినిమానే తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

‘ఎన్టీఆర్‌’ సినిమాకు దర్శకుడిని వెదకడంలో విఫలం అయిన బాలకృష్ణ తన సినిమాకు ఎక్కువ గ్యాప్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో వినాయక్‌తో సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యాడు. సి కళ్యాణ్‌ బ్యానర్‌లో వినాయక్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలయ్య, వినాయక్‌ల కాంబో మూవీని దసరాకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్‌ సినిమా విషయమై బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో అంటూ అభిమాను మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.