Balakrishna ignores NTR completely

ఎన్టీఆర్ సినిమా అడియో ఫంక్షన్ కి బాలకృష్ణ కాని, బాలకృష్ణ సినిమా ఆడియో ఫంక్షన్ కి ఎన్టీఆర్ కాని చివరిసారిగా ఎప్పుడు వచ్చారు? ఠక్కున అడిగితే మీరు మాత్రం ఏం సమాధానం చెబుతారు లేండి. గత కొన్నేళ్ళుగా వీరిద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా చూడలేదు మనం. మరి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు ఇలా ఎడమొహం పెడమొహంగా ఎందుకు ఉంటున్నారు. మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా వీరిద్దరి మధ్య గొడవలు నిజమేనా? నిజానిజాలు మన దాకా ఎక్కడ వచ్చాయి కాని, మనం కొద్దిపాటి అబ్జర్వేషన్ చేసిన ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు మాత్రం లేవని క్లియర్ గా అర్థం అవుతుంది.

ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాల్లో బాలకృష్ణ రిఫరెన్సులు ఉండేవి. ఇప్పుడు ఉండట్లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాల గురించి బాలయ్యబాబు, బాలకృష్ణ సినిమాల గురించి ఎన్టీఆర్ మాట్లాడేవారు. ఇప్పుడు అది జరగట్లేదు. ఇద్దరు ఓ ఫ్రేమ్ లో కూడా ఉండటం లేదు. సడెన్ గా ఎన్టీఆర్ టీడిపి రాజకీయాలకు కూడా దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఇవన్ని వీరి మధ్య దూరాన్ని సజెస్ట్ చేస్తున్నా, ఇవన్ని పక్కనపెడదాం. నిన్న జరిగిన విషయాన్ని మాత్రమే తీసుకున్నా, ఇద్దరి మధ్య ఏదో జరిగింది అనే అనుమానం రాకమానదు.

మొన్న బాలకృష్ణ పుట్టినరోజు జరిగింది కదా. ఆ సందర్భంగా అభిమానుల కోసం ఫేస్ బుక్ లైవ్ చాట్ చేసారు బాలయ్య. అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాని 90% ప్రశ్నలను పట్టించుకోకుండా వదిలేసారు. ఎందుకంటే ఆ ప్రశ్నలన్ని ఎన్టీఆర్ కి సంబంధించినవి. తారక్ పేరు కనిపించిన ఏ ప్రశ్నకి కూడా సమాధానమివ్వలేదు బాలకృష్ణ. ఎందుకంటారో మీరే చెప్పండి.