బాలయ్య ఎవరిని వదలడం లేదుగా..!     2018-05-21   21:52:13  IST  Raghu V

ఎన్టీఆర్‌ బయోపిక్‌కు క్రిష్‌తో దర్శకత్వం చేయించేందుకు బాలయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అడిగినంత పారితోషికం ఇవ్వడంతో పాటు, ఆయన కావాల్సిన సమయంలో సినిమాను టేకోవర్‌ చేసే అవకాశంను కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మణికర్ణిక చిత్రాన్ని చేస్తున్న క్రిష్‌ ఆ తర్వాత బాలయ్య ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల గురించి జోరుగా చర్చలు జరుగుతున్న సమయంలోనే బాలయ్య మరో సినిమాకు కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణకు గతంలో ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను ఇచ్చిన బోయపాటి ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం ఆయనతో సినిమా చేయాలని బాలయ్య కోరుకుంటున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. చాలా రోజులుగా బాలయ్య, బోయపాటి మూవీ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు అది ఇప్పుడు వర్కౌట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మొదట వినాయక్‌ద ర్శకత్వంలో మూవీని చేయబోతున్న బాలయ్య ఆ తర్వాత ఎన్టీఆర్‌ చిత్రాన్ని చేస్తాడా లేదంటే బోయపాటి మూవీని చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి బాలయ్య ఏ ఒక్క దర్శకుడిని కూడా వదలకుండా సక్సెస్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.