బాలయ్య ఎవరిని వదలడం లేదుగా..!     2018-05-21   21:52:13  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ సక్సెస్‌ కోసం అర్రులు చాచుకుని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడో ఒకటి అర సక్సెస్‌లు దక్కించుకుంటున్న నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పైసా వసూళ్‌ మరియు జైసింహా చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఆ రెండు సినిమాల ఫలితాలతో బాలయ్యలో కసి పెరిగినట్లుగా ఉంది. అందుకే ఆయన ఈసారి ఎలాగైనా సక్సెస్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం తనకు గతంలో సక్సెస్‌లు ఇచ్చిన దర్శకులందరిని పట్టుకుంటున్నాడు. వినాయక్‌, క్రిష్‌, బోయపాటి ఇలా ముగ్గురు దర్శకులతో ఈయన గతంలో సినిమాలు చేసి సక్సెస్‌లు దక్కించుకున్నాడు.

ఇప్పుడు మరోసారి వీరి దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పటికే వినాయక్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ బ్యానర్‌లో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. జూన్‌ మొదటి లేదా రెండవ వారంలో సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ సినిమాలో శ్రియను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. మరో వైపు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌ను కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.