‘బాహుబలి’ తర్వాత మహానటికే ఆ ఘనత     2018-05-26   04:49:07  IST  Raghu V

ఈమద్య కాలంలో స్టార్‌ హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా కూడా కేవలం మొదటి రెండు వారాల్లోనే వీలైనంత వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ సినిమాలను పట్టించుకునే నాధుడే ఉండటం లేదు. చాలా అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలు మూడవ వారంలో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇక ఏదైనా ఒక సినిమా నాలుగు వారాల పాటు కంటిన్యూగా వసూళ్లు సాధించింది అంటే అది మామూలు సక్సెస్‌ కాదని చెప్పుకోవచ్చు. రికార్డు బ్రేకింగ్‌ చిత్రాల జాబితాలో ఆ చిత్రం ఉటుంది.

ఇప్పుడు మహానటి ఆ రికార్డు బ్రేకింగ్‌ చిత్రాల జాబితాలో నిలువబోతుంది. మహానటి చిత్రం మూడవ వారంకు ఎంటర్‌ కాబోతుంది. అయినా కూడా కలెక్షన్స్‌ భారీగా వస్తున్నాయి. మొదటి వారంలో కాస్త డల్‌గా ఉన్న కలెక్షన్స్‌ రెండవ వారంకు ఊపందుకున్నాయి. ఇక మూడవ వారంలో కూడా ఇదే స్థాయి వసూళ్లను సాధించడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు నమ్మకంగా చెబుతున్నారు. గత సంవత్సరం విడుదలైన బాహుబలి 2 మరియు అంతకు ముందు సంవత్సరం విడుదలైన బాహుబలి చిత్రాలు మొదటి మూడు వారాలు ఒకే రకమైన వసూళ్లను సాధించి రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు అదే తరహాలో మహానటి చిత్రం కూడా వసూళ్లను సాధిస్తుంది.