Bad luck started with Mahesh, still Continues

14 రీల్స్ ఎంటర్తైన్మెంట్, టాలివుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. మొదటి చిత్రం నమో వేంకటేశతో ఓ మోస్తారు ఎంట్రీ ఇచ్చిన ఈ బడా ప్రొడక్షన్ హౌజ్, రెండోవ సినిమాతోనే పెను ప్రకంపనలు సృష్టించింది. సూపర్ స్టార్ మహేష్ తో తీసిన దూకుడు సంచలన విజయాన్ని నమోదు చేసుకోని, అప్పటివరకు టాలివుడ్ లో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించింది. రెండోవ చిత్రంతోనే బడా నిర్మాతలు అయిపోయారు రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనీల్ సుంకర. కాని అప్పుడు వారు అనుకోలేదు ఏమో, అదే వారి చివరి బ్లాక్బస్టర్ గా, కొన్నేళ్ళు ఉండిపోతుంది అని. బేసిక్ గా మహేష్ బాబు అభిమానులు అయిన వీరు, ఆ అభిమానంతోనే తమ హీరో డేట్స్ అన్ని తమ దగ్గరే ఉండేలా వరుసపెట్టి సినిమాలు సైన్ చేయించుకున్నారు. దూకుడు తరువాత 1 – నేనొక్కడినే మరియు ఆగడు సినిమాలు చేసారు 14 రీల్స్.

1 – నేనొక్కడినే భారీ బడ్జెట్ సినిమా. విపరీతమైన అంచనాలు, అప్పట్లోనే 70 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్, భారి ప్రమోషన్స్ తో బాగా హైప్ జనరేట్ చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారి డిజాస్టర్ గా నిలించింది. కాలక్రమంలో టాలివుడ్ వారు గర్వంగా చెప్పుకునే సినిమాగా పేరు తెచ్చుకున్నా, కాసులు మాత్రం రాలేదు. ఆ దెబ్బతో డీలాపడ్డ 14 రీల్స్ వారు, మళ్ళీ దూకుడు కాంబినేషన్ ని నమ్ముకొని ఆగడు తీస్తే, అది కూడా పోయింది. 1 తీసినందుకు కనీసం పొగడ్తలైనా వచ్చాయి. ఆగడు ఆ చప్పట్లు కూడా లేవు. అప్పులు పెరిగిపోయాయి. అయినా మొండిగా మహేష్ బాబుని మరో సినిమా అడిగారు. వారి అదృష్టం ఏమిటంటే, ఆ సినిమానే బ్రహ్మోత్సవం. అది తరువాత పివిపి చేతిలో పడి 14 రీల్స్ కి మేలు చేసింది.