హిందీ సినిమాల పరువు మళ్ళీ తీసిన బాహుబలి     2017-10-23   06:21:33  IST  Raghu V

Baahubali 2 creates all time record on TV

బాహుబలి 2 సంచలనాలు ఇంకా ఆగట్లేదు. సినిమా విడుదలై, 1700 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించి ఆరు నెలలు అవుతున్నా, రికార్డులు ఇంకా బ్రేక్ అవుతూనే ఉన్నాయి. అదేదో, తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రేక్షకుల అండతో బ్రేక్ అయితే అది వేరే విషయం, కాని హిందీ ప్రేక్షకులు బాహుబలికి ఇంకా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. అక్టోబర్ 8న బాహుబలి 2 తొలిసారి టీవిలో టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే. హిందీ లో సోనీ మ్యాక్స్ ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా, రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. హిందీ టెలివిజన్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన సినిమా ప్రీమియర్ గా బాహుబలి రికార్డు సృష్టించింది. సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ సినిమాలకు మళ్ళీ చుక్కలు చూపించింది.

BARC విడుదల చేసిన ఫలితాల ప్రకారం, అత్యధికంగా వీక్షింపబడిన హిందీ సినిమా ప్రీమియర్స్ ఇవే :

TV impressions :

1) బాహుబలి 2 – 26054

2) ప్రేమ్ రతన్ ధన్ పాయో – 25119

3) బజరంగీ భాయిజాన్ – 23745

4) బాహుబలి – 20777

5) దంగల్ – 16264