కృష్ణా జిల్లాలో ఘోరం..బీటెక్ విద్యార్ధినిపై అత్యాచారం ..     2018-06-30   00:02:39  IST  Raghu V

ఏపీ రాజధాని ప్రధాన జిల్లా అయిన కృష్ణా లోని ఆగిరిపల్లి లో ఘోరం జరిగింది..బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన జరిగి మూడేళ్ళు అయ్యింది అయితే తాజాగా జరిగిన ఒక ఘటనతో మళ్ళీ తెరపైకి వచ్చిన విషయం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం అయ్యింది…పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

2015 ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని తన తోటి విద్యార్థి వంశీకృష్ణ తన పుట్టిన రోజు పార్టీ ఇస్తానని చెప్పి మరో సీనియర్‌ శివారెడ్డితో కలిసి ఆగిరిపల్లిలోని ఓ గదికి తీసుకువెళ్లాడు.. అయితే పార్టీ అన్నారు గదిలో ఎవరూ లేరు అని ఆమె అడిగేలోగానే ఆమెపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆ ఘాతుకాన్ని కెమెరాలో భంధించారు..ఈ విషయం ఎవరికైనా చెప్తే ఈ వీడియో ని బహిర్గతం చేస్తామని బెదిరించారు