మొటిమల మచ్చలను తొలగించటానికి ఆయుర్వేద పేస్ పాక్స్     2018-06-15   23:21:00  IST  Lakshmi P

చర్మ సమస్యల పరిష్కారానికి మన పూర్వికులు ఆయుర్వేదాన్ని బాగా ఉపయోగించేవారు. చర్మ సమస్యల్లో అధికంగా అందరిని ఇబ్బంది పెట్టె సమస్య మొటిమల సమస్య. మొటిమలు తగ్గాక వాటి తాలూకు మచ్చలు అలానే ఉండిపోతాయి. మొటిమలు,మచ్చలను సమర్ధవంతంగా తొలగించే కొన్ని ఆయుర్వేద పేస్ పాక్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ పాలలో అరస్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.

అరస్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత తేలికపాటి క్లీన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మొటిమల మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి.