మందుబాబులు బహుపరాక్-ఇకపై మందుకొట్టి బండి నడపాలనుకంటే  

మద్యం మత్తులో ఉన్న బీటెక్ కుర్రాళ్లు పట్టపగలు నగర మెయిన్ రోడ్ మీద చేసిన ప్రమాదం ,ఆ ప్రమాదంలో చిన్నారి రమ్య సహా నాలుగు కుటుంబాల వారు మృత్యువాత పడడం ఇప్పటికి తలుచుకుంటే మనసుని కలిచివేస్తుంది.రోడ్డు ప్రమాదం అనేది కేవలం ఒక ఘటన కాదు ఆ ఘటన చుట్టు ఎన్నో కుటుంబాల జీవితాలు ఆధారపడి ఉంటాయి.. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ప్రభుత్వాలు సూచిస్తున్నా,ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టిన పెడచెవిన పెట్టేవారే ఎక్కువ.అలాంటి వారికోసమే ఈ వినూత్న వాహనం..

భోపాల్‌లోని లక్ష్మీనారాయన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బీటెక్ చదువుతున్న ఐశ్వర్య ఒక నూతన యంత్రాన్ని కనిపెట్టింది.ఐశ్వర్య స్వస్థలం బీహార్ లోని భవానీపూర్.మందుబాబుల ఆగడాలను కట్టడి చేయడానికి కనిపెట్టిన ఈ ఆవిష్కరణను పూణేలో జరిగిన ఒక పోటీ కార్యక్రమంలో ప్రదర్శణకు ఉంచింది.ఈ ప్రాజెక్టుకు ఐశ్వర్య ‘ఆల్కహాల్ డిటెక్టర్ అండ్ ఆటోమేటిక్ ఇంజిన్ లాకింగ్ సిస్టమ్’ అని పేరుపెట్టారు.ఈ ప్రాజెక్ట్ ను రూపొందించడంలో ఐశ్వర్య కాలేజ్ ప్రొఫెసర్లు ఆమెకు సహకారం అందించారు.

అతి తక్కువ ఖర్చుతో…ఎలా పనిచేస్తుందంటే..

ఈ మెషీన్ ని కారులో అమర్చేందుకు 900 రూపాయలు మాత్రమే అవతుంది.అంతేకాదు అతితక్కువ ప్లేస్లో దీన్ని అమర్చొచ్చు. దీనిని డ్యాష్ బోర్డు వద్ద ఉంచవచ్చు.ఈ మెషీన్ కి అనుసంధానం చేసిన ఒకవైరు కారు బ్యాటరీకి, మరోవైరు కారు ఇంజన్‌కు అమర్చాల్సి ఉంటుంది. దీంతో అది పనిచేయడం ప్రారంభిస్తుంది. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉంటే ఈ యత్రం అతని శ్వాసను పసిగట్టి ఇంజన్ స్టార్ట్‌కాకుండా చేస్తుంది. ఫలితంగా మద్యం తాగని వ్యక్తి మాత్రమే కారు నడపగలుగుతాడు.కాబట్టి మందు కొట్టి కారు నడపాలనుకుంటే కష్టమే..తాగి ఉన్న వ్యక్తి స్టీరింగ్ వదిలేవరకు కారు కదలదు,మీరు కదలరు.