ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా.? స్వర్గానికా లేక నరకానికా.?     2018-06-23   23:09:08  IST  Raghu V

ఆత్మహత్య మహా పాపం. దేవుడు మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు. మనం బతికి నలుగురిని బతికించడానికి మన జీవితం ఉండాలి కానీ చిన్న చిన్న కారణాల వల్ల మన జీవితాన్ని మనమే ముగించుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావలి. అందులో కొంత ఉన్నా మన సమస్యలు అన్ని తీరిపోతాయి. అయితే చిన్నప్పటి నుండి మనం స్వర్గం, నరకం అనే రెండిటి గురించి వింటూనే ఉన్నాము. సినిమాల్లో చూస్తూనే ఉన్నాము. పుణ్యాలు చేస్తే స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి వెళ్లారు అని మన పూర్వికులు మన ఎప్పటినుండో చెప్తూనే ఉన్నారు. నరకంలో కఠినమైన శిక్షలు ఉంటాయి. స్వర్గం లో అయితే విలాసాలు ఉంటాయి. అయితే ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు ఏమ‌వుతాయి? అస‌లవి ఎక్క‌డికి వెళ్తాయి? అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా. అయితే తెలుసుకుందాం రండి.

ఆయువు ముగియ‌కుండా బ‌లవంతంగా ప్రాణాలు తీసుకోవ‌డం, ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క్ష‌మించ‌రాని నేరాల‌ని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయువు ముగియ‌కుండా ఆత్మ‌హ‌త్య చేసుకుంటే మ‌ర‌ణ‌మ‌నే ప్ర‌క్రియ ఇంకా పూర్తికాన‌ట్టేన‌ట‌. ఆయువు తీర‌కుండా ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు న‌రకం లేదా స్వ‌ర్గానికి వెళ్ల‌వ‌ట‌. వారి ఆత్మలు ‘కామ‌లోకం’ అనే ప్ర‌త్యేక లోకంలో ఇరుక్కుని అక్క‌డే తిరుగుతాయ‌ట‌.