నల్లని మచ్చలకు ముడతలకు చెక్ పెట్టాలంటే ..... అశ్వగంధ     2018-07-05   01:49:15  IST  Lakshmi P

అశ్వగంధలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన చర్మ సమస్యలను పరిష్కరించటంలో సహాయపడుతుంది. అశ్వగంధను మన పూర్వీకుల కాలం నుండి ఆరోగ్య పరంగాను, బ్యూటీ పరంగాను వాడుతున్నాయి. మరల ఇప్పుడు దీని వాడకం పెరిగింది. అనేక సౌందర్య ఉత్పత్తులతో ఉపయోగిస్తున్నారు. అంతేకాక అశ్వగంధ పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ పొడిని ఉపయోగించి నల్లని మచ్చలకు,ముడతలకు చెక్ పెట్టవచ్చు. అశ్వగంధ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఒక స్పూన్ అశ్వగంధ పొడిలో సరిపడా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలన యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయస్సు రీత్యా వచ్చే ముడతలు రాకుండా నివారిస్తుంది.