పెళ్ళిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా.? అసలు అరుంధతి ఎవరు?     2018-06-25   00:12:32  IST  Raghu V

కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుకున్న ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే… వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైప చూడమని అంటారు. ఇది ఒక సాంప్రదాయమైంది.

అరుంధతి ఎవరంటే.?

బ్రహ్మ దేవుడు సృష్టికార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఓ అందమైన కన్యను, అంతకు మించిన అందమైన వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ కన్యపేరే సంధ్య…ఆమే తర్వాత అరుంధతిగా మారింది. ఆ అందమైన వ్యక్తే మన్మధుడు.

సంధ్య అరుందతి గా ఎందుకు మారింది?

బ్రహ్మ మన్మధుడిని సృష్టించి ఓ 5 సమ్మోహన బాణాలనిచ్చాడు. వాటిని పరీక్షించాలని తలచి మన్మథుడు బ్రహ్మలోకంలోని వారిపైనే వాటిని ప్రయోగించాడు..దీంతో బ్రహ్మతో సహా అందరూ సంద్య పట్ల మోహానికి గురైయ్యారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి ఈశ్వరుడిని ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడకి ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. దీనంతటికీ కారణం మన్మథుడని తలచి బ్రహ్మ మన్మథున్ని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.