బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనబోయేది వీరేనా?  

బిగ్ బాస్ సీజన్ 1 ఇలా ముగిసిందో లేదో, అప్పుడే బిగ్ బాస్ సీజన్ 2 గురించి చర్చలు మొదలయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శివబాలాజీ సీజన్ 1 టైటిల్ ని ఎగరేసుకుపోగా, సీజన్ కూడా అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ మేకర్స్. ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశమున్న సీజన్ 2 కోసం ఇప్పటినుంచే సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆ రూమర్స్ లో వీరి పేర్లు వినబడుతున్నాయి.

తేజస్వీ మడివాడను సీజన్ 1 కోసమే అల్రెడి అడిగేసారు‌. మరి అప్పుడు ఎందుకు వదులుకుందో కాని, సీజన్ 2 ఈ అమ్మడు చేసినా చేయవచ్చు. గ్లామర్ కోసం ఛార్మీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట. కాని ఛార్మీ పూరి జగన్నాథ్ సినిమాలను హ్యాండిల్ చేస్తూ బీజీబిజీగా గడుపుతోంది. హౌజ్ లోకి వచ్చేందుకు ఈ హాట్ హీరోయిన్ సుముఖత వ్యక్తపరుస్తుందో లేదో చూడాలి‌.

హ్యాపి డేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, సింగర్ గీతా మాధురి, హీరో తరుణ్, యాంకర్ లాస్య, యాక్టర్ తనీష్ ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న మిగితా పేర్లు. మరి నిజంగానే వీరితో సంప్రదింపులు జరుపుతున్నారో లేక ఇంటర్నెట్ లో పుట్టుకొచ్చే ఎన్నో గాలికబుర్లలో ఇది ఒకటా అనేది తేలాలి.

ఎప్రిల్ లోనే సెకండ్ సీజన్ మొదలైనా, దానికింకా చాలా అంటే చాలా టైమ్ ఉంది. ఆ టైమ్ వరకు వీరిలో షో కోసం అందుబాటులో ఉండేది ఎంతమందో, ఖాలిగా ఉండేది ఎంతమందో.