హౌజ్ నుంచి తర్వాత బయటకు వచ్చేది ఆయనే. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన వ్యాఖ్యలు.!     2018-07-02   03:53:58  IST  Raghu V

వారాలు గడిచే కొద్దీ బిగ్ బాస్ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ప్రతి వారం ఒక్కొక్కరిపై ఎలిమినేషన్ పిడుగు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజన, నూతన్ నాయుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం గీతా మాధురీ, కిరిటీ, గణేష్ నామినేషన్లలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో.. గీతా మాధురీ, గనేష్‌లు సేఫ్ జోన్‌లోకి రావడంతో కిరిటీ ఇంటి నుంచి బయటకు వెళ్లక తప్పలేదు.

ఇక నెక్స్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇటీవలే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి అర్చన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె దృష్టిలో నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది అతనే అంట. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా.? వివరాలు మీరే చూడండి!