ఆపిల్ సిడర్ వెనిగర్ తో చుండ్రును తరిమికొడదాం...ఎలా?    2018-04-10   00:12:49  IST 

మారిన జీవనశైలి,కాలుష్యం వంటి కారణాలతో ప్రతి ఒక్కరూ ఎదో ఒక సందర్భంలో చుండ్రు బారిన పడుతున్నారు. చుండ్రు సమస్యకు మార్కెట్ లో దొరికే యాంటీ డాండ్రఫ్ ఉత్పత్తులను ఉపయోగించటం వలన పెద్దగా ఉపయోగం కనపడటం లేదు. అంతేకాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సహజసిద్ధమైన పద్దతుల ద్వారా చుండ్రును వదిలించుకోవటం మంచిది. ఈ సహజసిద్ధమైన పదార్ధాల కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాక ఉపయోగించటం కూడా చాల సులువు. మీరు కూడా ట్రై చేయండి.


ఒక మగ్గు డిస్టిల్డ్ వాటర్ లో ఒక స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.