జగన్ దే హవా..ఊహించని రిజల్ట్స్..జాతీయ సర్వే     2018-04-04   02:46:07  IST  Bhanu C

ఏపీలో ఊహించని స్థాయిలో మార్పులు రానున్నాయా..? ఎన్నికల్లో వైసీపి పార్టీ తన సత్తా చాట నుందా..? ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే వైసీపికి రికార్డు స్థాయిలో గెలుపు ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటోంది తాజాగా జరిగిన జాతీయ స్థాయి సర్వే..అంతేకాదు టిడిపి పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని..వైసీపి కి ఊహించని స్థాయిలో విజయం అందబోతుందని చెప్తోంది ఈ సర్వే.. దేశవ్యాప్తంగా జ‌మిలీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం భావిస్తున్న త‌రుణంలో పార్టీల‌న్నీ ఇప్ప‌టినుంచే తమ వ్యుహాలకి పదును పెట్టేశాయి..పెంచేశాయి. జ‌మిలీ ఎన్నిక‌లు జ‌రిగితే ఈ ఏడాది చివ‌ర్లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు రానున్నాయి.లేనిప‌క్షంలో వ‌చ్చే ఏడాది ఏప్రిల్,మే మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గి అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీల భవితవ్యం ఎలా ఉంటుంది అనే విషయంపై జాతీయ స్థాయిలో జరుగుతున్నస‌ర్వేలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉన్న‌వాటితో పాటు ప్రాంతీయ పార్టీల‌పై కూడా కొన్ని ప్రైవేట్ సంస్థ‌లు క‌న్నేశాయి. వీటితో పాటు జాతీయ మీడియా సంస్థ‌లు కూడా ఈ స‌ర్వేల‌పై ఫోక‌స్ పెడ్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హ‌వా ఉంది,ఏ పార్టీలు అధికారంలోకి వ‌స్తాయి, లోక్ స‌భ స్థానాలు ఎన్ని గెలుచుకోగ‌ల‌రు, ముఖ్యంగా యూపీఏ,ఎన్డీయే మిత్ర ప‌క్షాల ప‌ట్టు ఎలా ఉంది….ఇలా అనేక విష‌యాల‌పై స‌మ‌గ్రంగా స‌ర్వే జరుగుతోంది..ఇందులో భాగంగానే ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం పై కూడా ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు స‌ర్వేలు జ‌రిపాయి.