బాబు క్యాబినెట్ లోకి కొత్త మంత్రులు..లిస్ట్ ఇదే     2018-03-16   02:14:12  IST  Bhanu C

AP New Cabinet Ministers List Ready

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నారు..తన మంత్రులని సైతం కేంద్ర పదవులకి రాజీనామాలు చేయించడంతో..ఏపీ లో మంత్రులుగా ఉన్న బీజేపీ వాళ్ళు సైతం మంత్రి పదవులకు రాజీనామా చేసేశారు.. ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఏపీ లో రాజకీయలలో భారీ మార్పులు నెలకొన్నాయి..సామాజిక వర్గాల వారీగా..ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఏపీలో మార్పులు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి నెలకొంది…దాంతో చంద్రబాబు తన క్యాబినెట్ విస్తరణ చేయడం తప్పనిసరి అవుతోంది అయితే…ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో కేబినెట్ విస్తరణపైనే చర్చలు కొనసాగుతున్నాయి. ఆశావాహులు కూడా ప్రయత్నాలు మొదలెట్టేశారు.

ఇదిలాఉంటే బీజేపీ వాళ్ళు రిజైన్ చేయగా ఏర్పడిన ఖాళీల భర్తీలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది…విస్తరణ జరుగనున్న నేపథ్యంలో ముస్లింలకు, ఎస్టీలకు అకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం, ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం మిగిలి ఉండటంతో చంద్రబాబు ఈ వర్గాలని ఆకట్టుకోవడానికి ఆ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని టాక్..